చిట్‌ఫండ్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ భవనానికి భూమిపూజ

17 Nov, 2023 01:24 IST|Sakshi
భూమిపూజ చేస్తున్న నాయకులు

కరీంనగర్‌: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా రిజిస్టర్‌ చిట్‌ఫండ్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ భవనానికి గురువారం పద్మనగర్‌లో అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు హెచ్‌.రాజిరెడ్డి, జాయింట్‌ సెక్రటరీ బి.నర్సింగరావు భూమిపూజ చేశారు. అసోసియేషన్‌ కోసం సొంత కమ్యూనిటీ హాల్‌ నిర్మించుకోవడం ఉద్యోగులు, యాజమాన్యాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, అందరి అవసరాలకనుగుణంగా ఉంటుందని అసోసియేషన్‌ బాధ్యులు కొనియాడారు. అసోసియేషన్‌ నాయకులు వేణుమూర్తి, శ్రీనివాస్‌, సత్యనారాయణరావు, రంజిత్‌కుమార్‌, రాంమోహన్‌రావు, అనంతరెడ్డి, చంద్రకాంత్‌, రాంరెడ్డి, హరీష్‌, శ్రీనివాస్‌, రాజు, సంతోష్‌కుమార్‌, అనిల్‌కుమార్‌, ప్రశాంతరావు, తిరుపతిరావు, సమ్మయ్య, సురేశ్‌బాబు, నవీన్‌కుమార్‌, గోపాల్‌రావు, చరణ్‌కుమార్‌, శ్రావణ్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు