అన్నదానంతో ఆత్మానందం

17 Nov, 2023 01:24 IST|Sakshi

గన్నేరువరం: అన్నదానంతో ఆత్మానందం కలుగుతుందని ప్రముఖ జ్యోతిష్య వాస్తు ఆగమశాస్త్ర పండితులు నమిలకొండ రమణాచార్యులు అన్నారు. మండలంలోని కాసీంపేట మానసా దేవి ఆలయాన్ని గురువారం సందర్శించారు. కొద్ది రోజులుగా యజ్ఞ యాగాలు జరుగుతుండటంతోపాటు మూలా నక్షత్రం సందర్భంగా జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా అన్నదానం ప్రారంభమై నేటితో వంద రోజులయ్యాయి. నమిలకొండ రమణాచార్యులు అన్నదాన విశేషాలను తెలియజేశారు. అన్నదానం వల్ల అశాంతి తొలగుతుందని, మనిషికి తృప్తినిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ గౌరవాధ్యక్షుడు బద్దం నరసింహారెడ్డి, అధ్యక్షుడు చంద్రారెడ్డి, ఆలయ అర్చకులు నాగసాయిశర్మ, కమిటీ సభ్యులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు