చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడొద్దు

24 Nov, 2023 02:04 IST|Sakshi
కవాతును ప్రారంభిస్తున్న సీఐ రవీందర్‌
● కరీంనగర్‌ రూరల్‌ ఏసీపీ కరుణాకర్‌రావు ● గోపాల్‌రావుపేటలో పోలీసులు, సాయుధ బలగాల కవాతు

రామడుగు: గోపాల్‌రావుపేటలో గురువారం కరీంనగర్‌ రూరల్‌ ఏసీపీ కరుణాకర్‌రావు, చొప్పదండి సీఐ రవీందర్‌, ఎస్సై తోట తిరుపతి ఆధ్వర్యంలో సాయుధ బలగాలతో కవాతు నిర్వహించారు. ఏసీపీ మాట్లాడుతూ... ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని కోరారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న దృష్ట్యా చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసులకు పూర్తి స్థాయిలో సహకరించాలని ప్రజలను కోరారు.

మరిన్ని వార్తలు