నేటి నుంచి అయ్యప్ప ఆలయంలో భిక్ష

24 Nov, 2023 02:04 IST|Sakshi
దుర్గామాత విగ్రహానికి స్నపనం నిర్వహిస్తున్న అర్చకులు

కరీంనగర్‌కల్చరల్‌: నగరంలోని భగత్‌నగర్‌ జెడ్పీ క్వార్టర్స్‌ ఆవరణలోని అయ్యప్ప దేవాలయంలో శుక్రవారం నుంచి జనవరి 8 వరకు ఉదయం తేనీరు, మధ్యాహ్నం భిక్ష, రాత్రి అల్పాహారం ఆలయం పక్షాన దాతలు, భక్తులు సహాయంతో నిర్వహిస్తున్నట్లు ఈవో కొస్న కాంతారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. విరాళాలందించే దాతలు, భక్తులు ఆలయంలోని అర్చక, సిబ్బందిని సంప్రదించి రశీదు తప్పనిసరి పొందాలని కోరారు.

ఉత్సవమూర్తులకు

అలంకారం

కరీంనగర్‌కల్చరల్‌: కట్టారాంపూర్‌ అభయాంజనేయస్వామి దేవాలయంలో జరుగుతున్న తృతీయ వార్షికోత్సవంలో భాగంగా గురువారం ఆలయంలో దుర్గామాతతో పాటు సీతారామచంద్రస్వామి ఉత్సవమూర్తులకు స్నపనం, అలంకారం వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఈవో నాగారపు శ్రీనివాస్‌, అర్చకులు కొమ్మెర రవిశర్మ, తాడూరి సుగుణాకర్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు