గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిబాపూలే

29 Nov, 2023 01:40 IST|Sakshi
పూలే చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న నాయకులు

కరీంనగర్‌ కార్పొరేషన్‌: మహాత్మా జ్యోతిబాపూలే గొప్ప సంఘ సంస్కర్త అని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కొనియాడారు. జ్యోతిబాపూలే వర్ధంతి సందర్భంగా మంగళవారం నగరంలోని డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కులవ్యవస్థ నిర్మూలనకు అనాడే ప్రయత్నించిన మహనీయుడన్నారు. మహిళలకు విద్య అందించడంలో ఆయన చేసిన కృషి మరవలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు మడుపు మోహన్‌, షబానా మహమ్మద్‌, గంగుల దిలీప్‌, సిరిపురం నాగప్రసాద్‌, ముల్కల కవిత, మన్నె జ్యోతి, శారద, మహాలక్ష్మి, హనీఫ్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు