డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులో ముగ్గురికి జైలు

3 Dec, 2023 00:36 IST|Sakshi

కరీంనగర్‌ క్రైం: డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులో ముగ్గురికి జైలుశిక్ష విధిస్తూ కరీంనగర్‌ మున్సిఫ్‌ కోర్టు తీర్పునిచ్చింది. కరీంనగర్‌ ట్రాఫిక్‌ ఏసీపీ సర్వర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల కరీంనగర్‌లో మద్యం సేవించి, వాహనాలు నడుపుతూ పట్టుబడిన 8 మందిని ట్రాఫిక్‌ పోలీసులు శనివారం మున్సిఫ్‌ కోర్టులో హాజరుపరిచారు. చిగురుమామిడికి చెందిన మహిపాల్‌, కరీంనగర్‌కు చెందిన రాజు, కన్నాపూర్‌కు చెందిన కనకయ్యలకు మూడు రోజుల జైలుశిక్ష, రూ.6,500 జరిమానా, మిగతా ఐదుగురికి కలిపి రూ.9 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చినట్లు ఏసీపీ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు