పాపకు జన్మనిచ్చి.. తల్లి మృతి

3 Dec, 2023 00:36 IST|Sakshi

జగిత్యాల: పాపకు జన్మనిచ్చి.. ఓ తల్లి మృతిచెందిన ఘటన శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. ధర్మపురి మండలానికి చెందిన ఓ గర్భిణి రెండు రోజుల క్రితం ప్రసవం కోసం జగిత్యాల మాతాశిశు సంరక్షణ కేంద్రానికి వచ్చింది. వైద్యులు సిజేరియన్‌ చేయగా పాపకు జన్మనిచ్చింది. శిశువు బాగానే ఉన్నప్పటికీ తల్లికి రక్తస్రావం ఆగకపోవడంతో కుటుంబసభ్యులు కరీంనగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడా ఇబ్బందులు ఎదురవడంతో నగునూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. దురదృష్టవశాత్తు ఆమె మృతిచెందింది. దీంతో మృతురాలి కుటుంబసభ్యులు, బంధువులు జగిత్యాల ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. రాత్రి 10 గంటలకు సిజేరియన్‌ చేశారని, రక్తస్రావం ఆగకపోతే కనీస చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. రక్తస్రావం జరుగుతుంటే మరుసటి రోజు ఉదయం 9 గంటలకు కరీంనగర్‌ పంపించారన్నారు. ఈ విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను వివరణ కోరగా.. ఆమెకు రక్తం కూడా ఎక్కించామని, అయినా బ్లీడింగ్‌ ఎక్కువ కావడం, అందులోనూ కార్డియా అటాక్‌ జరిగి మృతిచెందినట్లు తెలిపారు.

మాతాశిశు సంరక్షణ కేంద్రం ఎదుట బాధితుల ఆందోళన

జగిత్యాలలో ఘటన

ఆలస్యంగా వెలుగులోకి..

మరిన్ని వార్తలు