రాష్ట్ర స్థాయి క్రికెట్‌ పోటీలకు ఎంపిక

3 Dec, 2023 00:36 IST|Sakshi
విద్యార్థిని అభినందిస్తున్న హెచ్‌ఎం, పీడీ
మహిళను నమ్మించి ఆభరణాలు చోరీ

చొప్పదండి: ఈ నెల 5వ తేదీ నుంచి గద్వాల్‌లో జరిగే రాష్ట్రస్థాయి స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ అండర్‌–17 క్రికెట్‌ పోటీలకు చొప్పదండి బాలుర ఉన్నత పాఠశాల పదోతరగతి విద్యార్థి ఎం.సూర్యతేజ ఎంపికయ్యాడు. గత నెల 24న సెంటినరీకాలనీలో జరిగిన ఉమ్మడి జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరచడంతో రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాడని ఫిజికల్‌ డైరెక్టర్‌ కృష్ణ తెలిపారు. విద్యార్థిని హెచ్‌ఎం వైద్యుల రాజిరెడ్డి, ఎస్‌ఎంసీ చైర్మన్‌ మమత, ఉపాధ్యాయులు శనివారం అభినందించారు.

మరిన్ని వార్తలు