ఓ మహిళను నమ్మించి, ఆమె వద్ద నుంచి బంగారు

3 Dec, 2023 00:36 IST|Sakshi

మెట్‌పల్లి(కోరుట్ల): ఓ మహిళను నమ్మించి, ఆమె వద్ద నుంచి బంగారు ఆభరణాలు చోరీ చేసిన ఘటన మెట్‌పల్లి పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మెట్‌పల్లి దుబ్బవాడకు చెందిన ఆకుల గంగు శనివారం తన తోటకు నడుచుకుంటూ వెళ్తోంది. మార్గమధ్యలో ఎస్సారెస్పీ కెనాల్‌ వద్ద గుర్తు తెలియని వ్యక్తి ద్విచక్రవాహనంపై వచ్చాడు. ఆమెకు రూ.1.50 లక్షల ఆఫర్‌తోపాటు తులం బంగారం వచ్చిందని సెల్‌ఫోన్‌లో చూపించాడు. తనతో వస్తే ఇప్పిస్తానని నమ్మబలికాడు. అంగీకరించడంతో ఆమె ఇంటికి వెళ్లాడు. తర్వాత ఒంటిపై బంగారం ఉంటే నగదు, బంగారం ఇవ్వరని చెప్పి, తీయించి, ఒక సంచిలో పెట్టించాడు. ఆమెను పాత బస్టాండ్‌ వద్ద దించాడు. అక్కడి నుంచి తిరిగి ఆ మహిళ ఇంటికి వెళ్లి, సంచిలో ఉంచిన 3 తులాల బంగారు ఆభరణాలను తీసుకొని, పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చిరంజీవి తెలిపారు.

మరిన్ని వార్తలు