డిజిటల్‌ విద్యపై అవగాహన ఉండాలి

3 Dec, 2023 00:36 IST|Sakshi
నియామక పత్రం ఇస్తున్న వీసీ మల్లేశ్‌

కరీంనగర్‌రూరల్‌: నగునూరు తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో శనివారం కంప్యూటర్‌ సైన్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో అంతర్జాతీయ డిజిటల్‌ లిటరసీ డే నిర్వహించారు. కార్యక్రమాన్ని అల్ఫోర్స్‌ మహిళా డిగ్రీ కళాశాల చైర్మన్‌ రవీందర్‌రెడ్డి జ్యోతిప్రజ్వలన చేసి, ప్రారంభించారు. పోటీ ప్రపంచంలో విద్యార్థులందరికీ తప్పనిసరిగా డిజిటల్‌ విద్యపై అవగాహన ఉండాలన్నారు. అనంతరం విద్యార్థులు డిజిటల్‌ లిటరసీపై ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ప్రిన్సిపాల్‌ డి.శ్రీహరి, వైస్‌ ప్రిన్సిపాల్‌ సమత, కంప్యూటర్‌ సైన్స్‌ డిపార్ట్‌మెంట్‌ హెచ్‌వోడీ లలితా అశ్విని, లైబ్రేరియన్‌ మోహన్‌రావు, లెక్చరర్లు ఇందిర, శారద, నమ్రత తదితరులు పాల్గొన్నారు.

ఎస్‌యూ ఎన్‌ఎస్‌ఎస్‌ కో–ఆర్డినేటర్‌గా మనోహర్‌

కరీంనగర్‌ సిటీ: శాతవాహన విశ్వవిద్యాలయం ఎన్‌ఎస్‌ఎస్‌ నూతన కో–ఆర్డినేటర్‌గా డా.ఎ.మనోహర్‌ నియమితులయ్యారు. ఈ మేరకు వర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ మల్లేశ్‌ శనివారం ఆయనకు నియామక పత్రం అందించారు. రిజిస్ట్రార్‌ వరప్రసాద్‌, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ ప్రసాద్‌, ఫైనాన్స్‌ ఆఫీసర్‌ రవీందర్‌, పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్‌ ఎన్‌.వి.శ్రీరంగ ప్రసాద్‌, డాక్టర్‌రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఐక్యూఏసీ డైరెక్టర్‌గా శ్రీరంగప్రసాద్‌

కరీంనగర్‌ సిటీ: శాతవాహన యూనివర్సిటీ అంతర్గత బదిలీల్లో భాగంగా వర్సిటీ ఐక్యూఏసీ డైరెక్టర్‌గా డాక్టర్‌ ఎన్‌.వి.శ్రీరంగప్రసాద్‌ నియమితులయ్యారు. ఈ మే రకు విశ్వావిద్యాలయ ఉపకులపతి ఆచార్య మల్లేశ్‌ శనివారం ఆయనకు నియామక పత్రం అందజేశారు.

సెల్‌ఫోన్‌ అప్పగింత

ముస్తాబాద్‌(సిరిసిల్ల): మండలంలోని గూడెం గ్రామానికి చెందిన రాజలింగం ఇటీవల తన స్మార్ట్‌ ఫోన్‌ను పోగొట్టుకున్నాడు. ఆయన ఫి ర్యాదు మేరకు ఐటీ కానిస్టేబుల్‌ రాజశేఖర్‌ ఫో న్‌ను రికవరీ చేశారు. ఎస్‌ఐ శేఖర్‌రెడ్డి శనివారం బాధితుడిని పిలిపించి, అందజేశారు. ఈ సందర్భంగా రాజలింగం వారికి కృతజ్ఞతలు తెలిపాడు.

మరిన్ని వార్తలు