జిల్లా స్థాయి ఖోఖో పోటీలకు స్పందన

3 Dec, 2023 00:36 IST|Sakshi
క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న ఎస్జీఎఫ్‌ కార్యదర్శి శ్రీనివాస్‌

కరీంనగర్‌ స్పోర్ట్స్‌: పాఠశాలల క్రీడా సమాఖ్య జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం కరీంనగర్‌లోని అంబేడ్కర్‌ స్టేడియంలో నిర్వహించిన అండర్‌–14 బాలబాలికల ఖోఖో పోటీలకు స్పందన వచ్చింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. పోటీలను జిల్లా పాఠశాలల క్రీడా సమాఖ్య కార్యదర్శి శ్రీనివాస్‌ ప్రారంభించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో విజయం సాధించి, జిల్లాకు పేరు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో పీడీ, పీఈటీలు సారయ్య, శంకరయ్య, ఎల్వీ రమణ, హన్మంతు, శ్రీనివాస్‌, సత్యనారాయణ, రేణుక, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

నేడు జిల్లాస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలు..

జిల్లా పాఠశాలల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ఆది వారం కరీంనగర్‌లోని అంబేడ్కర్‌ స్టేడియంలో అండర్‌–14, 17 బాలబాలికలకు అథ్లెటిక్స్‌ పోటీలు ని ర్వహిస్తున్నట్లు జిల్లా పాఠశాలల క్రీడా సమాఖ్య కా ర్యదర్శి శ్రీనివాస్‌ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు తమ వయసు ధ్రువీకరణ పత్రంతో ఉదయం స్టేడియంలో రిపోర్టు చేయాలని సూచించారు.

మరిన్ని వార్తలు