‘చితి’కిపోయిన ఇంటి పెద్దలు

3 Dec, 2023 00:36 IST|Sakshi
బాలయ్య (ఫైల్‌)

కోనరావుపేట(వేములవాడ): నేతకార్మిక కుటుంబంలో విషాదం నెలకొంది. అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో ఇంటి పెద్దలు ‘చితి’కిపోయారు. ఆ కుటుంబంలో అనారోగ్యానికి గురైన ఏకై క కుమారుడు పదిరోజుల క్రితం చనిపోగా, శుక్రవారం రాత్రి తండ్రి మృతిచెందాడు. గ్రామస్తులు విరాళాలు సేకరించి అంత్యక్రియలు నిర్వహించారు. వివరాలు.. కోనరావుపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన ఆడెపు బాలయ్య(70) కొన్నేళ్ల క్రితం ముంబయ్‌లో నేత కార్మికుడిగా పనిచేశాడు. అతడి కొడుకు ముకుందం(49) గ్రామంలోనే ప్రైవేట్‌ పాఠశాల నిర్వహించి నష్టపోయాడు. తర్వాత ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. ముకుందంకు భార్య అరుంధతి, ఇద్దరు కుమారులు ఉన్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వైద్యానికి డబ్బుల్లేక నవంబర్‌ 20న మృతిచెందాడు. గ్రామస్తులు విరాళాలు జమ చేసి అంత్యక్రియలు నిర్వహించారు. ముకుందం తండ్రి బాలయ్య శుక్రవారం రాత్రి మృతిచెందగా చందాలతో అంత్యక్రియలు నిర్వహించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

మొన్న కుమారుడు.. నిన్న తండ్రి

పది రోజుల వ్యవధిలో ఇద్దరూ మృతి

నేత కుటుంబంలో విషాదం

మరిన్ని వార్తలు