అదుపుతప్పి ధాన్యం లారీ బోల్తా

3 Dec, 2023 00:36 IST|Sakshi
బోల్తాపడిన లారీ

ధర్మపురి: వరి ధాన్యం లోడుతో వెళ్తున్న ఓ లారీ బో ల్తా పడిన ఘటనలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యా యి. వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల వైపు నుంచి శని వారం మధ్యాహ్నం ఓ లారీ ధర్మపురికి ధాన్యం లో డుతో వెళ్తోంది. ఆకసాయిపల్లె గుట్టమలుపు వద్ద అ దుపుతప్పి పడిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ షేక్‌ రజల్‌ కాలు నుజ్జునుజ్జయింది. స్థానికులు 108కు సమాచారం అందించడంతో సిబ్బంది అని ల్‌ వచ్చి, ప్రథమ చికిత్స చేశాడు. అనంతరం అంబులెన్స్‌లో జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లా రు. బాధితుడు గోదావరిఖనివాసి అని తెలిసింది.

డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

ఆకసాయిపల్లె గుట్టమలుపు వద్ద ఘటన

మరిన్ని వార్తలు