ర్యాండమైజేషన్‌ పూర్తి

3 Dec, 2023 00:50 IST|Sakshi
మాట్లాడుతున్న జిల్లా ఎన్నికల అధికారి పమేలా సత్పతి
ఆదివారం శ్రీ 3 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2023

కరీంనగర్‌ అర్బన్‌: ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్‌ ప్రక్రియ కౌంటింగ్‌ పరి శీలకులు సీఆర్‌ ప్రసన్న, ఎస్‌జే చౌడ, మనీష్‌కుమార్‌ లోహన్‌ సమక్షంలో పూర్తయినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ పమేలా సత్పతి తెలి పారు. శనివారం కలెక్టరేట్‌ కార్యాలయ సమావేశ మందిరంలో ఓట్ల లెక్కింపు సిబ్బంది ర్యాండమైజేషన్‌ నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఈ నెల 3న ఆదివారం ఎస్సారార్‌ కళాశాలలో జిల్లాలోని కరీంనగర్‌ 390 పోలింగ్‌ కేంద్రాల ద్వారా 27 మంది అభ్యర్థుల ఓట్లను లెక్కించడానికి 22 మంది కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు, 28 మంది కౌంటింగ్‌ అసిస్టెంట్లు, 22 మంది మైక్రో అబ్జర్వర్లు, 16 రిజర్వుతో కలుపుకొని మొత్తం 88మందిని నియమించినట్లు పేర్కొన్నారు. మానకొండూర్‌కు సంబంధించి 316 పో లింగ్‌ కేంద్రాల ద్వారా 10మంది అభ్యర్థుల ఓట్ల ను లెక్కించడానికి 17మంది కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు, 20మంది కౌంటింగ్‌ అసిస్టెంట్లు, 17మంది మైక్రో అబ్జర్వర్లు, 14 మంది రిజర్వ్‌తో కలుపుకొని 68మందిని నియమించామని అన్నారు. హుజూరాబాద్‌ 305 పోలింగ్‌ కేంద్రాల ద్వారా 22 మంది అభ్యర్థుల ఓట్లను లెక్కించడానికి 17మంది కౌంటింగ్‌ సూపర్‌వైజర్‌లు, 20మంది కౌంటింగ్‌ అసిస్టెంట్లు, 17 మంది మైక్రో అబ్జర్వర్లను 15 మంది రిజర్వ్‌తో కలుపుకొని 69మందిని నియమించినట్లు వివరించారు. చొప్పదండిలో 327 పోలింగ్‌ కేంద్రాలలో మంది ఓట్లను లెక్కించడానికి 16 మంది కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు 18మంది కౌంటింగ్‌ అసిస్టెంట్లు, 16మంది మైక్రో అబ్జర్వర్లను 14మంది రిజర్వ్‌తో కలుపుకొని 64 మందిని మొత్తంగా 305మందిని నియమించినట్లు వివరించారు. ఆర్వోలు ప్రఫుల్‌ దేశాయ్‌, లక్ష్మి కిరణ్‌, కె.మహేశ్వర్‌, ఎస్‌.రాజు, సీపీవో కొమురయ్య, డీఐవో శివరాం, డీటీవో నాగరాజు, జీఏం ఇండస్ట్రీస్‌ నవీన్‌ పాల్గొన్నారు.

కౌంటింగ్‌ ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్‌

అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనున్న ఎస్సారార్‌ కళాశాలను జిల్లా ఎన్నికల అధికారి పమేలా సత్పతి శనివారం పరిశీలించారు. నియోజకవర్గాల వారీగా ఎన్ని టేబుళ్లు ఏర్పాటు చేశారు, ఎన్ని రౌండ్లుగా లెక్కించనున్నారు, సిబ్బంది వివరాలు, సౌకర్యాల ఏర్పాట్లను అధికారులతో సమీక్షించారు. అధికారులు, సిబ్బంది పారదర్శకంగా వ్యవహరించాలని, ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలుండాలని సూచించారు.

కలెక్టర్‌ పమేలా సత్పతి

న్యూస్‌రీల్‌

మరిన్ని వార్తలు