లెక్కింపు ముగిసేవరకు కేంద్రాన్ని వదలొద్దు

3 Dec, 2023 00:50 IST|Sakshi
మాట్లాడుతున్న కౌంటింగ్‌ అబ్జర్వర్‌ ప్రసన్నకుమార్‌

కౌంటింగ్‌ అబ్జర్వర్‌ సీఆర్‌.ప్రసన్న కుమార్‌

కరీంనగర్‌ అర్బన్‌: ఓట్ల లెక్కింపు సెంటర్‌లో ఉండే సిబ్బంది ఎవరూ కౌంటింగ్‌ ముగిసే వరకు కేంద్రాన్నివదిలి వెళ్లకూడదని కౌంటింగ్‌ ఆబ్జర్వర్‌ సీఆర్‌ ప్రసన్న కుమార్‌ సూచించారు. శనివారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల కౌంటింగ్‌లో పాల్గొనే అకౌంటింగ్‌ సూపర్‌వైజర్లు, మైక్రో అబ్జర్వర్లకు మాస్టర్‌ ట్రైనర్లు శిక్షణ నిర్వహించారు. కౌంటింగ్‌ అబ్జర్వర్లు ిసీఆర్‌ ప్రసన్న, ఎస్‌జే.చౌడ, మనిష్‌ కుమార్‌లోహన్‌ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కౌంటింగ్‌హాల్లో మైక్రో అబ్జర్వర్లు ఉదయం 6గంటలకు హాజరు కావాలని తెలిపారు. కౌంటింగ్‌ కేంద్రంలోని సెల్‌ఫోన్‌, ఎలక్ట్రానిక్‌ పరికరాలను తీసుకువెళ్లకూడదని తెలిపారు. పోస్టల్‌ బ్యాలెట్‌లను మొదటగా లెక్కించాలని, అనంతరం ఈవీఎంలోని ఓట్లను లెక్కించాలని సూచించారు. ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని, ఏవైనా సమస్యలు ఎదురైనట్లయితే వెంటనే రిటర్నింగ్‌ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌ సదానందం, మార్కెటింగ్‌ అధికారి పద్మావతి, ఎల్డిఎం ఆంజనేయులు, డీఈవో జనార్దన్‌ రావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు