ఎస్సారార్‌ కౌంటింగ్‌ సెంటర్‌లో మూడంచెల భద్రత

3 Dec, 2023 00:50 IST|Sakshi
● జిల్లావ్యాప్తంగా నేటినుంచి 4వ తేదీ ఉదయం వరకు 144 సెక్షన్‌ ● ఉత్తర్వులు జారీ చేసిన సీపీ అభిషేక్‌ మహంతి

కరీంనగర్‌క్రైం: ఆదివారం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో కరీంనగర్‌ జిల్లావ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఎస్సారార్‌ కౌంటింగ్‌ కేంద్రం వద్ద సీపీ అభిషేక్‌ మహంతి ఆధ్వర్యంలో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. కౌంటింగ్‌ సందర్భంగా పోటీ చేసిన అభ్యర్థులు, ఏజెంట్లు తదితరులకు ముందస్తుగానే పాస్‌లు జారీ చేశారు. పాస్‌లు ఉన్న వారిని మాత్రమే లోనికి అనుమతించనున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగేలా మూడోతేదీ ఉదయం ఆరుగంటల నుంచి 4వ తేదీ ఉదయం ఆరు గంటల వరకు కమిషనరేట్‌వ్యాప్తంగా 144సెక్షన్‌ అమలులో ఉంటుందని సీపీ వెల్లడించారు. దీని ప్రకారం.. ఐదుగురికి మించి గుమికూడరాదని తెలిపారు. ఏదైనా చట్టపరిధిలోని కారణంచేత, సమావేశం అయ్యే అవసరం ఉంటే సంబంధిత అధికారి అనుమతి తప్పనిసరి అని తెలిపారు. 144సెక్షన్‌ ఉత్తర్వులు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు