పిల్లలు భయపడుతున్నరు

3 Dec, 2023 00:50 IST|Sakshi

పెద్ద సంఖ్యలో కోతులు వచ్చేసరికి మా కాలనీలోని పిల్లలందరూ భయపడుతున్నరు. ఒకటి, రెండు వస్తే సంతోషంగా ఉంటున్నరు. గుంపులుగా వచ్చి ఇష్టమచ్చినట్లు వ్యవహరిస్తూ నానా బీభత్సం సృష్టించడంతో జంకుతున్నరు.

– శేఖర్‌, రాంనగర్‌

ఇంటిపైనే ఉంటున్నయ్‌

కోతులన్ని ఒకేసారి గుంపులుగుంపులుగా వస్తున్నయ్‌. ఇంటిపైనే ఉంటూ మా రేకులపై ఎగిరి దూకుతున్నయ్‌. ఇంటిపైనే గంటల తరబడి సుమారు 20కి పైగా కోతులు తిరుగుతున్నయ్‌. నగరపాలక సంస్థ అధికారులు కోతుల బెడద నుంచి కాపాడాలి. – అరవింద్‌, పద్మనగర్‌

అధికారులు చొరవ తీసుకోవాలి

గతంలో కుక్కల బెడద ఉండేది. ఇప్పుడు లేదు. మళ్లీ కోతుల గుంపు వచ్చింది. పెద్ద సంఖ్యలో వచ్చాయి. ఇంటి తలుపు తీసి ఉంటే చాలు.. ఇంట్లోకి వచ్చి చిందరవందర చేస్తున్నయ్‌. నగరపాలక సంస్థ అధికారులు వెంటనే చొరవ తీసుకుని కోతుల బెడద నుంచి తప్పించాలి. – ప్రవీణ్‌, గోదాంగడ్డ

మరిన్ని వార్తలు