నేడు లక్ష దీపోత్సవం

3 Dec, 2023 00:50 IST|Sakshi
పూజలు చేస్తున్న గడ్డం నాగరాజు

విద్యానగర్‌(కరీంనగర్‌): కార్తీక మాసం సందర్భంగా నగునూర్‌లోని శ్రీదుర్గాభవానీ ఆలయంలో ఆదివారం సాయంత్రం లక్ష దీపోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మాధికారి, వేదపండితుడు పురాణం మహేశ్వరశర్మ తెలిపారు. అమ్మవారికి కార్తీక మాస ప్రయోక్త చతుషష్టి పూజలు, దీప సంకల్పం, దీపారాధన, మహా మంగళ హారతి అనంతరం దీపోత్సవ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. కార్యక్రమాల్లో భక్తులు భాగస్వాములై అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు.

బొడ్రాయి పండుగ

మానకొండూర్‌రూరల్‌: మండలంలోని శ్రీనివాస్‌నగర్‌లో శనివారం మహాలక్ష్మి, భూలక్ష్మి సహిత బొడ్రాయి పండుగను అర్చకుల ఆధ్వర్యంలో గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకుడు గడ్డం నాగరాజు పాల్గొని భక్తి, శ్రద్ధలతో అమ్మవార్లకు మొక్కులు చెల్లించారు. ఈసందర్భంగా నాగరాజును ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు శాలువాతో సన్మానించారు. కొట్టె నరేశ్‌, రవీందర్‌, రవి, గ్రామప్రజలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు