5 నుంచి విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు

3 Dec, 2023 00:52 IST|Sakshi
నిర్మాణం పూర్తయిన ఆలయం

కరీంనగర్‌రూరల్‌: కరీంనగర్‌ మండలం మొగ్ధుంపూర్‌లో నూతనంగా నిర్మించిన శ్రీమల్లికార్జునస్వామి ఆలయంలో ఈనెల 5 నుంచి విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. వేదపండితుడు కాసుల చంద్రశేఖరశాస్త్రి ఆధ్వర్యంలో ఈనెల 5న ఉదయం గణపతి పూజ, పుణ్యహవచనము, అఖండ దీపారాధన, అంకురార్పణ, సాయంత్రం దేవతాహవనం, మూలమంత్రహవనం, పూజాహారతి కార్యక్రమం నిర్వహిస్తారు. 6న మండల పూజ, కలశస్పపనం, నవగ్రహ పూజలు జరుగుతాయి. 7న ఆవాహిత మంటపపూజ, ధాన్యాధివాసం, మూలమంత్రహవనం, ఉదయం 11గంటలకు శ్రీమల్లికార్జునస్వామి విగ్రహంతో పాటు కేతమ్మ, మేడలమ్మ, వినాయకుడు, రేణుకాఎల్లమ్మ, అంజనేయస్వామి, ధ్వజస్తంభం, నవగ్రహ విగ్రహాలను ప్రతిష్ఠాపన చేస్తారు. మూడు రోజుల పాటు విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు కాశవేణి భూమయ్య, కమిటీ అధ్యక్షుడు కూకట్ల రాజయ్య, ప్రధాన కార్యదర్శి దాడి లక్ష్మణ్‌ తెలిపారు. గ్రామస్తులు అధికసంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని వారు కోరారు.

మరిన్ని వార్తలు