భక్తిలో ఆర్తి ఉండాలి

3 Dec, 2023 00:52 IST|Sakshi
ప్రవచిస్తున్న పురాణం మహేశ్వరశర్మ

విద్యానగర్‌(కరీంనగర్‌): భక్తిలో ఆర్తితో పాటు చిత్తశుద్ధి, ఏకాగ్రత, శరణాగతి ఉండాలని వేదపండితుడు పురాణం మహేశ్వరశర్మ అన్నారు. కార్తీక మాసం సందర్భంగా కరీంనగర్‌ మండలం నగునూర్‌లోని శ్రీదుర్గాభవానీ ఆలయంలో శనివారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. భగవంతుడు అపారమైన ధనకనకానికి తూగక.. భక్తితో మహాసాద్వి సమర్పించిన చిన్న తులసిదళానికి తూగినట్లు, అచంచల భక్తితత్వాన్ని ఆకళింపు చేసుకొని పరమాత్ముడిని స్మరిస్తే మోక్షప్రాప్తి లభిస్తుందన్నారు. నేను అనే అహం వీడి నిర్మల హృదయంతో భక్తితో ఆరాధించడం తప్ప మానవుడికి మరో మార్గం లేదని అన్నారు. ఆదర్శ జీవన విధానంతో మనిషి జీవన వికాసం సురక్షితమవుతుందన్నారు. ఆలయ ప్రధానార్చకుడు పవనకృష్ణశర్మ, ఆలయ ఫౌండర్‌ చైర్మన్‌ వంగళ లక్ష్మణ్‌, ఆలయ కమిటీ బాధ్యులు, భక్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు