నగరవ్యాప్తంగా ఫాగింగ్‌

3 Dec, 2023 00:52 IST|Sakshi

కరీంనగర్‌కార్పొరేషన్‌: నగరంలో దోమల నియంత్రణకు నగరపాలక సంస్థ శనివారం ఫాగింగ్‌ చేపట్టింది. నగరంలో దోమలు విపరీతంగా పెరిగిపోయి ప్రజలు వ్యాధులబారిన పడుతున్న వైనంపై ‘పారిశుధ్యంపై పట్టింపేది.. జాడ లేని ఫాగింగ్‌ పేరిట ఈనెల 1న వచ్చిన సాక్షి కథనంపై అధికారులు స్పందించారు. నగరంలోని రాంనగర్‌, ముకరాంపుర, కాశ్మీర్‌గడ్డ, హౌసింగ్‌ బోర్డుకాలనీ తదితర ప్రాంతాల్లో శానిటేషన్‌ సిబ్బంది ఫాగింగ్‌ నిర్వహించారు. ఫాగింగ్‌ నిర్వహించినట్లు ఆయా కాలనీవాసుల నుంచి సంతకాలు కూడా సేకరించారు. ఫాగింగ్‌ నిరంతరం చేపట్టి దోమలను పూర్తిగా నిర్మూలించాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.

మరిన్ని వార్తలు