డిగ్రీ విద్యార్థులకు ఉచితంగా ఇంగ్లిష్‌ పుస్తకాలు

3 Dec, 2023 00:52 IST|Sakshi
ఇంగ్లిష్‌ నోట్స్‌ ఆవిష్కరిస్తున్న అధ్యాపకులు

కొత్తపల్లి: శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయనున్న ఇంగ్లిష్‌ నోట్స్‌ను శనివారం సీతారాంపూర్‌లో ఆవిష్కరించారు. హమ్‌ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు, అధ్యాపకుడు ధనపూరి సాగర్‌ తయారు చేసిన డిగ్రీ మూడో సెమిస్టర్‌ నోట్స్‌ను ప్రభుత్వ మహిళా డిగ్రీ, పీజీ కళాశాల రిటైర్డ్‌ ప్రిన్సిపాల్‌ డా.అనంతం విడుదల చేశారు. శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలలో 3వ సెమిస్టర్‌ చదువుతున్న విద్యార్థులకు ఈ నోట్స్‌ ఎంతగానో ఉపయోగపడుతుందని, సులభంగా అర్థం చేసుకొని పరీక్షల్లో ఉత్తమ మార్కులు పొందేందుకు దోహదపడుతుందని అనంతం తెలిపారు. ఈ ఇంగ్లిష్‌ పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు సాగర్‌ చెప్పారు. దూర ప్రాంత విద్యార్థులు ఈ నోట్స్‌ను పొందాలంటే 8885549467 నెంబర్‌కు వాట్సాప్‌ ద్వారా కోరితే వారికి పీడీఎఫ్‌ రూపంలో పంపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డా.గుండా శ్రీనివాస్‌, ఆంగ్ల అధ్యాపకులు గుమ్మడి కుమారస్వామి, కుంటాల శ్రీనివాస్‌, జె.రమణ, ముని గోపాల్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు