వైభవంగా నవగ్రహ విగ్రహాల ప్రతిష్ఠ

3 Dec, 2023 00:52 IST|Sakshi
హాజరైన భక్తులు

సప్తగిరికాలనీ(కరీంనగర్‌): స్థానిక సాయినగర్‌ విజయగణపతి సాయిబాబా ఆలయంలో శనివారం నవగ్రహ విగ్రహాల ప్రతిష్ఠ వైభవంగా జరిగింది. దేవతా పూజలు, హోమాలు, పూర్ణాహుతి, యంత్ర, విగ్రహ ప్రాణప్రతిష్ఠా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్‌ ఆకునూరి చంద్రశేఖర్‌, ఎండోమెంట్‌ ఇన్స్‌పెక్టర్‌ పాము సత్యనారాయణ, ఈవో ఎండపల్లి మారుతి, వ్యవస్థాపక ధర్మకర్తలు నలువాల ప్రకాశ్‌, చిట్టుమల్ల కొండయ్య, ఆయిందాల లక్ష్మయ్య, వేదపండితులు కపర్ధిశర్మ, దుర్గాప్రసాద్‌శర్మ, ప్రణీత్‌శర్మ, అర్చకులు, సిబ్బంది గుడికాడి శ్రీనివాస్‌, పిట్టల అంజయ్యతో పాటు డాక్టర్‌ చిట్టుమల్ల ప్రదీప్‌కుమార్‌, ఆర్‌.శ్రీధర్‌, ఎం.సత్యం, శ్రీనివాస్‌, ఎన్‌.చంద్రశేఖర్‌, భక్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు