అభివృద్ధికి ప్రాధాన్యం

4 Dec, 2023 02:02 IST|Sakshi

చొప్పదండి నియోజకవర్గంలో అన్ని రంగాల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తా. ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడటంతో మోడల్‌ నియోజకవర్గంగా ఏర్పాటు చేయడానికి అవకాశం ఏర్పడింది. ప్రజల ఆశీర్వాదాన్ని స్వాగతిస్తున్నా. నా గెలుపు కోసం కష్టపడ్డ ప్రతీ కార్యకర్తకు, నాయకులకు కృతజ్ఞతలు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉంటా.– మేడిపల్లి సత్యం, ఎమ్మెల్యే, చొప్పదండి

ప్రజల కోసం పనిచేస్తా

చొప్పదండి నియోజకవర్గ ప్రజల తీర్పును గౌరవిస్తున్నా. ప్రజాస్వామ్యంలో వారి తీర్పే ఫైనల్‌. ప్రజల సమస్యల పరిష్కారానికి పోరాడుతా. నిత్యం ప్రజలతోనే ఉండి సేవచేస్తా. ఎన్నికల్లో గెలుపు, ఓటములు సహజం. ప్రజల కోసం కొట్లాడుతా. ప్రజలు ఏ తీర్పు ఇచ్చినా శిరసావహిస్తా.

– సుంకె రవిశంకర్‌, మాజీ ఎమ్మెల్యే, చొప్పదండి

నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

నాపై నమ్మకంతో మెజార్టీ ఇచ్చి గెలిపించిన హుజూరాబాద్‌ ప్రజలకు ధన్యవాదాలు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. నాకు టికెట్‌ ఇచ్చి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించినందుకు కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు, కవిత, సంతోశ్‌రావులకు ధన్యవాదాలు. 20 ఏళ్ల క్రితం మా నాన్నను రాజకీయంగా ఈటల గొంతుకోశాడు. ఇప్పుడు నా ఎమ్మెల్యే పదవిని కేసీఆర్‌కు, మా నాన్నకు రిటర్న్‌ గిఫ్ట్‌గా ఇస్తున్నా.

– పాడి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్యే హుజూరాబాద్‌

అధైర్యపడొద్దు

ఎన్నికల్లో గెలుపోటములు సహజం. నాయకులు, కార్యకర్తలు అధైర్యపడొద్దు. నా గెలుపు కోసం ఆహర్నిశలు పాటుపడినవారికి ఎల్లవేళలా అందుబాటులో ఉండి అండగా ఉంటా. ఒక సాధారణ కార్యకర్తగా పార్టీలో చేరిన నన్ను కాంగ్రెస్‌ అధిష్టానం టిక్కెట్‌ ఇస్తే.. ఓటేసి అశీర్వదించిన ప్రజలకు కృతజ్ఞతలు.

– వొడితెల ప్రణవ్‌, కాంగ్రెస్‌ అభ్యర్థి, హుజూరాబాద్‌

>
మరిన్ని వార్తలు