అభివృద్ధికి పట్టం కట్టారు

4 Dec, 2023 02:02 IST|Sakshi

కరీంనగర్‌లో నేను చేసిన అభివృద్ధి, బీఆర్‌ఎస్‌ పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాలను చూసి ప్రజలు పట్టం కట్టారు. ఈ గెలుపు మాలో మరింత బాధ్యతను పెంచింది. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పన్నినా ప్రజ లు సరైన తీర్పునిచ్చి ఐదు సంవత్సరాల్లో బీఆర్‌ఎస్‌ చేపట్టిన అభివృద్ధిని కొనసాగించేందుకు మరో అవకాశాన్ని కల్పించారు. కరీంనగర్‌ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా.– గంగుల కమలాకర్‌, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, కరీంనగర్‌

నైతిక విజయం నాదే

ప్రస్తుత ఎన్నికల్లో నైతిక విజయం నాదే. ఓ వర్గం నాపై కక్షకట్టి దుష్ప్రచారం జరిపింది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కుప్పకూలిపోవడం ఓ పీడ విరగడైంది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన సీఎం కేసీఆర్‌కు ప్రజలు తగిన రీతిలో బుద్ధిచెప్పారు. ఎంతటి విపత్తులోనైనా అండగా నిలుస్తున్న కరీంనగర్‌ ప్రజలను మరిచిపోలేను.

– బండి సంజయ్‌కుమార్‌, బీజేపీ అభ్యర్థి, కరీంనగర్‌

డబ్బు, మద్యం ఏరులై పారింది

కరీంనగర్‌ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌, బీజేపీ అభ్యర్థులు విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ చేశారు. గతంలో వారు మూడు, నాలుగు సార్లు పోటీచేసిన వారు కావడంతో ప్రచారం సులువుగా సాగింది. నేను కొత్తగా ఎమ్మెల్యే అభ్యర్థిత్వం తీసుకో వడం, ప్రచార గడువు లేకపోవడంతో ఆస్థాయిలో ఓట్లు రాబట్ట లేకపోయాను. అయినా ప్రజలకు అందుబాటులో ఉంటా.

– పురుమల్ల శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ అభ్యర్థి, కరీంనగర్‌

>
మరిన్ని వార్తలు