కౌంటింగ్‌కు పటిష్ట భద్రత

4 Dec, 2023 02:02 IST|Sakshi

కరీంనగర్‌ క్రైం: అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ సందర్భంగా ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాల ఆవరణలో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. సీపీ అభిషేక్‌ మహంతి సూచనల మేరకు ఉదయం 5గంటల నుంచి రాత్రి వరకు కేంద్ర బలగాలు, స్థానిక పోలీసులు విధులు నిర్వహించారు. కౌంటింగ్‌ కేంద్రంలోనికి కేవలం పాసులు ఉన్నవారినే అనుమతించారు. కళాశాల వద్ద పలు పార్టీల నాయకులు అభ్యర్థులు సంబరాలు చేసుకున్నారు. 144 సెక్షన్‌ అమల్లో ఉన్నందున సీపీతో పాటు పోలీసులు వారిని చెదరగొట్టారు. ఈ క్రమంలో స్వల్ప ఉఽద్రిక్తత ఏర్పడింది. కరీంనగర్‌ ఎమ్మెల్యే ఎన్నికల కౌంటింగ్‌ సందర్భంగా రీకౌంటింగ్‌ చేయాలని బీజేపీ అభ్యర్థి డిమాండ్‌ చేయగా.. నగరంలోని పలు ప్రాంతాల్లో బందోబస్తు నిర్వహించారు.

>
మరిన్ని వార్తలు