కవితను కలిసిన టీబీజీకేఎస్‌ నాయకులు

7 Dec, 2023 00:06 IST|Sakshi
ఎమ్మెల్సీ కవితతో టీబీజీకేఎస్‌ నాయకులు

రామగిరి(మంథని): తెలంగాణ బొగ్గు గని కా ర్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను టీబీజీకేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు బి. వెంకట్రావు, జనరల్‌ సెక్రటరీ మిర్యాల రాజిరెడ్డి, వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కెంగర్ల మల్లయ్య కలిశారు. సింగరేణి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యుహాలు, ఎన్నికలపై చర్చించారు. కార్మి కుల్లో 50 శాతం యువ ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నందున ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని కవిత సూచించారు. మాజీ సీఎం కేసీఆర్‌ నష్టాల్లో ఉన్న సింగరేణి సంస్థను లాభాల బాటా పట్టించిన విషయాన్ని కార్మికులకు తెలిపాలన్నారు. టీబీజీకేఎస్‌ ద్వారా యువత, మహిళలకు ఉద్యోగ కల్పన సాధ్యమైందన్న విషయాన్ని కార్మికులకు వివరిస్తూ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచేలా ప్రణాళికలు రూపొదించాలన్నారు.

>
మరిన్ని వార్తలు