‘పారమిత’ విద్యార్థులకు కలెక్టర్‌ అభినందన

7 Dec, 2023 00:06 IST|Sakshi
విద్యార్థులను అభినందిస్తున్న కలెక్టర్‌ పమేలా సత్పతి

కరీంనగర్‌: జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించిన పారమిత ఉన్నత పాఠశాల విద్యార్థులను కలెక్టర్‌ పమేలా సత్పతి బుధవారం అభినందించారు. ఈ నెల 5న తెలంగాణ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ వారి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన 31వ జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌లో పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. డి.శివచరణ్‌ రెడ్డి, బి.గౌరీశ్‌(పదోతరగతి), కె.ఋగ్వేద్‌(ఆరోతరగతి)లు రూపొందించిన వెండర్స్‌ ఫ్రెండ్లీ వెజిటేబుల్‌ కార్ట్‌ ప్రాజెక్టు జాతీయ పోటీలకు ఎంపికై నట్లు సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మెంబర్‌ సెక్రటరీ నగేశ్‌ తెలిపారు. విద్యార్థులు బుధవారం కలెక్టర్‌ను కలిశారు. ఈ ప్రాజెక్టు ద్వారా కూరగాయలు, పండ్లను ఎక్కువ సమయం తాజాగా ఉంచవచ్చని వివరించడంతో ఆమె అభినందించారు.

>
మరిన్ని వార్తలు