రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు ఎంపిక

7 Dec, 2023 00:06 IST|Sakshi
విద్యార్థులను అభినందిస్తున్న ప్రిన్సిపల్‌, పీడీ

జగిత్యాలరూరల్‌: మండలంలోని పొరండ్ల జెడ్పీ పా ఠశాలకు చెందిన ఎండీ సోహెల్‌, ఆకుల దీక్షిత రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల పీఈటీ అంజన్న తెలిపారు. ఈనెల 4న కరీంనగర్‌లో స్కూల్‌గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన అథ్లెటిక్స్‌ పోటీల్లో పాఠశాలకు చెందిన ఎండీ సోహెల్‌ డిస్కస్‌త్రోలో ప్రథమస్థానం, దీక్షిత 5 కి.మీ వాకింగ్‌లో ద్వితీయస్థానం సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈనెల 7 నుంచి 9 వరకు వరంగల్‌ హన్మకొండలో జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీల్లో వీరు పాల్గొననున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను పలువురు అభినందించారు.

రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్‌ పోటీలకు..

జగిత్యాలరూరల్‌: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో జరిగిన జిల్లాస్థాయి బాస్కెట్‌బాల్‌ పోటీల్లో కండ్లపల్లి మోడల్‌స్కూల్‌కు చెందిన విద్యార్థులు ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల ప్రిన్సిపల్‌ నాగసుధారాణి తెలిపారు. బాస్కెట్‌బాల్‌ అండర్‌ 17 బాలుర విభాగంలో మహేశ్‌, చరణ్‌, అఖిల్‌, అండర్‌ 14 బాలికల విభాగంలో రోహిత ప్రతిభ చాటి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికకాగా, బుధవారం పాఠశాల పీఈటీ వినీత్‌, అజీమ్‌, ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు.

>
మరిన్ని వార్తలు