గర్భస్థ లింగ నిర్ధారణ చట్ట వ్యతిరేకం

7 Dec, 2023 00:06 IST|Sakshi
మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్‌

పెద్దపల్లి డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్‌

పెద్దపల్లిరూరల్‌: గర్భస్థ లింగ నిర్ధారణ చట్ట విరుద్ధమని, నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాయని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి ప్రమోద్‌కుమార్‌ హెచ్చరించారు. కలెక్టరేట్‌లోని జిల్లా వైద్య ,ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో బుధవారం గర్భస్థ పూర్వ, గర్భస్థ లింగ నిర్ధారణ చట్టం–1994 జిల్లా సలహా కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికార అధ్యక్షత వహించారు. ఈసందర్భంగా ప్రమోద్‌కుమార్‌ మాట్లాడారు. జిల్లాలో ప్రతీ వెయ్యిమంది మగపిల్లలకు 926 మంది ఆడ పిల్లలు జన్మిస్తున్నారని తెలిపారు. గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు సీ్త్ర, పురుష లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే పరీక్షలు చేసిన వారికి, చేయించుకున్న వారికి, ప్రోత్సహించిన వారికి చట్టప్రకారం మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష, రూ.పది వేల జరిమానా విధిస్తారని పేర్కొన్నారు. లింగ నిర్ధారణ అరికట్టేందుకు ఆరోగ్యశాఖ సిబ్బందితో కూడిన బృందం ప్రతీనెల ఐదు స్కానింగ్‌ సెంటర్లను తనిఖీ చేస్తోందని వెల్లడించారు. తద్వారా స్కానింగ్‌ సెంటర్ల నిర్వాహకులకు లింగ నిర్ధారణ నివారణ చట్టంపై పూర్తిఅవగాహన కల్పించాలని సూచించారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రాకేశ్‌, ప్రోగ్రామ్‌ అధికారి (ఎంహెచ్‌ఎన్‌న్‌) డాక్టర్‌ ఆర్‌.రాజమౌళి, పిల్లల వైద్య నిపుణుడు రవీందర్‌, డిప్యూటీ డెమో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు