అప్పు చేసి ఇల్లు నిర్మించొద్దన్నందుకు..

6 Jan, 2024 01:16 IST|Sakshi

కరీంనగర్: మొట్లపల్లి గ్రామానికి చెందిన సంఘని రాజయ్య(50)అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారి కథనం ప్రకారం.. రాజయ్య గ్రామంలో నూతనంగా ఇంటి నిర్మాణం చేపట్టాడు. డబ్బులు లేక ఇంటి పనులు నిలిచి పోయాయి. అప్పు తెచ్చి నిర్మాణం కొనసాగించాలని కుటుంబ సభ్యులను కోరాడు. అప్పుతెచ్చి ఇల్లు కడితే అవి తీర్చలేక ఇబ్బందుల పాలవుతామని కుటుంబసభ్యులు నిరాకరించారు. మనస్తాపానికి గురైన రాజయ్య ఈనెల 4వ తేదీన పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వరంగల్‌ ఎంజీఎం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతుడి భార్య రాజమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై శ్రీనివాస్‌ తెలిపారు.

ముఖ్య గమని​క:
ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com

ఇవి చ‌ద‌వండి: భార్యపై దారుణంగా ప్ర‌వ‌ర్తించిన భ‌ర్త‌..

>
మరిన్ని వార్తలు