ఆన్‌లైన్‌లో ఫింగర్‌ప్రింట్‌ స్కానర్ బుక్‌.. తెరిచిచూస్తే షాక్‌!

7 Jan, 2024 23:34 IST|Sakshi

ఫింగర్‌ప్రింట్‌ స్కానర్‌ బుక్‌ చేసిన యువకుడు

కరీంనగర్: ఆన్‌లైన్‌లో ఫింగర్‌ప్రింట్‌ స్కానర్‌ బుక్‌ చేస్తే రాళ్లు వచ్చిన సంఘటన కోనరావుపేట మండలం కనగర్తిలో వెలుగుచూసింది. బాధితుడు తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కనగర్తికి చెందిన కొల్లూరి వికాస్‌ ఆన్‌లైన్‌లో ఫింగర్‌ప్రింట్‌ స్కానర్‌ కోసం జనవరి 1న బుక్‌ చేశాడు. 12న డెలివరీ ఇస్తామని షాపింగ్‌ సంస్థ స్పష్టం చేయగా.. ఆదివారమే పార్సిల్‌ ఇంటికొచ్చింది. డెలివరీ బాయ్‌కి రూ.2,718 చెల్లించి పార్సిల్‌ తీసుకున్నాడు. పార్సిల్‌ తెరిచి చూడగా రాళ్లు కనిపించడంతో కంగుతినడం యువకుడి వంతైంది. మోసం జరిగిందని వెంటనే డెలివరీ బాయ్‌కి చెప్పగా ఐటమ్‌ రిటర్న్‌ పెట్టమంటూ వెళ్లిపోయాడు.

>
మరిన్ని వార్తలు