కారును ఓవర్‌టేక్‌ చేస్తుండగా.. విద్యార్థి విషాదం!

22 Feb, 2024 09:41 IST|Sakshi
భూక్య సతీశ్‌ (ఫైల్‌)

రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి

మరొకరికి తీవ్ర గాయాలు

ఇసుక ట్రాక్టర్‌ కిందికి దూసుకెళ్లిన బైక్‌

కరీంనగర్: ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్‌ శివారులోని సిరిసిల్ల–కామారెడ్డి ప్రధాన రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విద్యార్థి అక్కడికక్కడే మృతిచెందాడు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్సై రమాకాంత్‌ తెలిపిన వివరాలు. వీర్నపల్లి మండలం భావ్‌సింగ్‌తండాకు చెందిన భూక్య సతీశ్‌(19), భూక్య సాయిరాం బైక్‌పై మాచారెడ్డి నుంచి రాచర్లగొల్లపల్లికి వస్తున్నారు.

రాచర్లబొప్పాపూర్‌ శివారులో ముందు వెళ్తున్న కారును ఓవర్‌టేక్‌ చేస్తుండగా ఎదురుగా వస్తున్న ఇసుక ట్రాక్టర్‌ను తప్పించబోయి బైక్‌తోపాటు కిందికి దూసుకెళ్లారు. ఈ ప్రమాదంలో సతీశ్‌ సంఘటన స్థలంలోనే మృతిచెందాడు. మరొకరు సాయిరాం తీవ్రంగా గాయపడగా.. స్థానికులు, బ్లూకోర్టు కానిస్టేబుల్‌ సతీశ్‌ కలిసి ఆస్పత్రికి తరలించారు. సతీశ్‌ మరణంతో భావ్‌సింగ్‌తండాలో విషాదం అలుముకుంది. మృతునికి తల్లితండ్రులు మంజుల–రాజు, సోదరి జ్యోతి ఉన్నారు. సంఘటన స్థలాన్ని ఎస్సై రమాకాంత్‌ సందర్శించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి చదవండి: పెళ్లింట విషాదం!

whatsapp channel

మరిన్ని వార్తలు