నాటుసారా తయారీ అడ్డాపై దాడి

22 Mar, 2023 02:04 IST|Sakshi

మాలూరు : తాలూకాలోని అణికరహళ్లిలో అక్రమంగా నాటు తయారు చేస్తున్న అడ్డాపై మంగళవారం మాస్తి పోలీసులు దాడి చేశారు. నాటుసారా తయారు చేసున్నట్లు తమకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఎలాంటి అనుమతి లేకుండా నాటు సారా తయారు చేస్తున్న గ్రామానికి చెందిన మునియప్ప అనే వ్యక్తి వద్ద నుంచి 50 లీటర్ల ప్లాస్టిక్‌ డ్రమ్‌, 2 అల్యూమినియం పాత్రలు, 2 లీటర్ల వాటర్‌ బాటిళ్లు, 15 లీటర్ల ముడి బెల్లం మిశ్రిత నాటుసారాను, నాటుసారా తయారీకి ఉపయోగిస్తున్న వస్తువులను, పాత్రలను స్వాధీనం చేసుకుని నిందితుడు మునియప్పను అరెస్టు చేశారు.

పార్టీ చెప్పినచోటే పోటీ: సిద్దు

శివాజీనగర: పార్టీ హైకమాండ్‌ చెప్పిన నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని కాంగ్రెస్‌ నేత సిద్దరామయ్య చెప్పారు. మంగళవారం బెంగళూరులో విలేకరులతో మాట్లాడిన సిద్దరామయ్య, పార్టీ పెద్దల నిర్ణయమే ఫైనల్‌ అన్నారు. తాము అధికారంలోకి వస్తే ఉచిత బియ్యం, ఉచిత విద్యుత్‌, యువకులకు నిరుద్యోగ భృతి తదితర హామీలను నెరవేరుస్తామని తెలిపారు.

మద్దతుదారుల ధర్నా

సిద్దరామయ్య కోలారు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఒత్తిడి చేస్తూ బెంగళూరులో శివానంద సర్కిల్‌లో ఉన్న ఆయన నివాసం వద్ద వందలాది మంది ధర్నా చేశారు. కోలారు నుంచి ఉదయమే పెద్ద ఎత్తున తరలివచ్చి సిద్దుకు మద్దతుగా నినాదాలు చేశారు.

మరిన్ని వార్తలు