వేధింపుల టీసీ అరెస్టు

22 Mar, 2023 02:04 IST|Sakshi

బనశంకరి: బెంగళూరు మెజెస్టిక్‌ రైల్వేస్టేషన్‌లో మహిళా ప్రయాణికురాలితో అనుచితంగా ప్రవర్తించాడని టీసీ సంతోష్‌కుమార్‌ ను రైల్వే పోలీసులు అరెస్ట్‌చేశారు. ఈ 14 తేదీన సంతోష్‌కుమార్‌ అనే టీసీ ప్లాట్‌ఫారం వద్ద నిలబడి ఉన్న యువతిని టికెట్‌ ఉందా? అని గదమాయిస్తూ వేధించాడు. తన వద్ద టికెట్‌ ఉందని చెబుతున్నా పట్టించుకోకుండా ఆమెను చేయి పట్టి లాగడంతో పాటు దూషించాడు. ఈ సందర్భంగా పెద్ద రభస చెలరేగింది. పలువురు ప్రయాణికులు యువతికి మద్దతుగా నిలిచేటప్పటికీ టీసీ అక్కడి నుంచి జారుకున్నాడు. ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్‌మీడియాలో అప్‌లోడ్‌ చేయడంతో వైరల్‌గా మారింది. ఆ సమయంలో అతడు బాగా మద్యం తాగి ఉన్నాడని కూడా తెలిసింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన రైల్వే పోలీసులు టీసీని అరెస్టు చేయగా, ఉన్నతాధికారులు సస్పెన్షన్‌ వేటు వేశారు.

మరిన్ని వార్తలు