పలు రైళ్ల రద్దు, కొన్ని దారి మళ్లింపు

23 Mar, 2023 01:00 IST|Sakshi

గుంతకల్లు: నైరుతి రైల్వేలో బెంగుళూరు సమీపంలో జరుగుతున్న రైల్వే పనుల్లో భాగంగా పలు రైళ్లను రద్దు చేయడంతోపాటు మరికొన్నింటిని దారి మళ్లించినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.

► ధర్మవరం– బెంగళూరు–ధర్మవరం (06595/96) స్పెషల్‌ ప్యాసింజర్‌ రైళ్లను ఏప్రిల్‌ 01.06, 29 వ తేదీల్లో రద్దు చేశారు.

► ఇక పూరి–యశ్వంత్‌పూర్‌ (22883) ఎక్స్‌ప్రెస్‌ రైలును ఈ నెల 31న నంద్యాల, యర్రగుంట్ల, రేణిగుంట, జోలార్‌పేట్‌ మీదుగా యశ్వంత్‌పూర్‌కు మళ్లించారు.

► ఎల్‌టీటీ ముంబై–కోయంబత్తూరు (11013) ఎక్స్‌ప్రెస్‌ రైలును గుంతకల్లు, రేణిగుంట, జోలార్‌పేట్‌, సేలం మీదుగా కోయంబత్తూరుకు మళ్లించారు.

► ఇక గుంతకల్లు డివిజన్‌లోని పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనుల కోసం పలు స్పెషల్‌ ప్యాసింజర్‌ రైళ్లను రద్దు చేశారు. గుంతకల్లు–రాయచూర్‌–గుంతకల్లు స్పెషల్‌ ప్యాసింజర్‌ రైళ్లును 23 నుంచి ఏప్రిల్‌ 1వ తేదీ వరకు నడపరు.

► నంద్యాల–కడప–నంద్యాల (07284/85), విజయపుర–రాయచూర్‌– విజయపుర స్పెషల్‌ ప్యాసింజర్‌ రైళ్లు 23వ తేదీ నుంచి ఈ నెల 31 వరకు రద్దయ్యాయి.

మరిన్ని వార్తలు