భార్య అర్ధ నగ్న చిత్రాలను స్నేహితులకు పంపిన భర్త

4 Jul, 2023 07:30 IST|Sakshi

కర్ణాటక: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ భర్త, భార్యపై ఉన్న కోపాన్ని తీర్చుకోవడానికి ఆమె ప్రైవేట్‌ వీడియోలు, అర్ధనగ్న చిత్రాలను స్నేహితులకు పంపడంతో పాటు ఇంటర్నెట్లో పెట్టాడు. ఇది తెలిసి బాధితురాలు మైసూరు సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు.. ఉదయగిరి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని శాంతి నగరలో నివాసం ఉంటున్న అబ్దుల్‌ సలీంతో 10 నెలల కిందట ఒక యువతికి పెళ్లయింది.

అయితే కొద్దిరోజులకే గొడవలు పడి దూరం అయ్యారు. ఇద్దరు కలిసి ఉన్న సమయంలో అబ్దుల్‌ సలీం భార్య వీడియోలు, అర్ధనగ్న ఫోటోలను తీసి పెట్టుకున్నాడు. తనను కాదని వెళ్లిపోయిందన్న ఉక్రోషంతో వాటిని స్నేహితులకు పంపడంతో పాటు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. బాధితురాలు సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా, విచారణ చేపట్టారు.

మరిన్ని వార్తలు