నేడు స్పందన భౌతికకాయం తరలింపు?

9 Aug, 2023 09:47 IST|Sakshi

యశవంతపుర: బ్యాంకాక్‌లో గుండెపోటుతో మృతి చెందిన నటుడు విజయ్‌ రాఘవేంద్ర భార్య స్పందన అంత్యక్రియలు బుధవారం సాయంత్రం జరిగే అవకాశాలున్నాయి. స్పందన తండ్రి బీకే శివరామ్‌కు ఫాంహౌస్‌లో నిర్వహించాలని కుటుంబసభ్యులు భావిస్తున్నారు. బెంగళూరు మల్లేశ్వరంలోని బీకే శివరామ్‌ నివాసంలో ప్రజల సందర్శనార్థం ఆమె భౌతికకాయాన్ని ఉంచి అంత్యక్రియలకు తరలిస్తారు.

స్పందన మృతదేహానికి బ్యాంకాక్‌లో పోస్టుమార్టం ఆలస్యం, ఇతర న్యాయ ప్రక్రియల వల్ల ఇంకా బెంగళూరుకు తీసుకురాలేదని కుటుంబసభ్యులు తెలిపారు. బ్యాంకాక్‌లో బుధవారం ఒంటిగంటకు మృతదేహాన్ని అప్పగించే అవకాశముంది. అక్కడి నుంచి కుటుంబసభ్యులు బెంగళూరుకు ప్రత్యేక విమానంలో తీసుకురానున్నారు. స్పందన, విజయ్‌రాఘవేంద్ర కుటుంబాలు బ్యాంకాక్‌లో ఉన్నాయి. స్పందన మృతిపై సినీ ప్రముఖులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు