యువకుడు ఆత్మహత్య

21 Aug, 2023 01:50 IST|Sakshi

హోసూరు: అనారోగ్యంతో బాధపడుతూ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన బాగలూరు వద్ద జరిగింది. వివరాల మేరకు బెంగళూరు దగ్గర అత్తిపల్లికి చెందిన అంజప్ప కొడుకు పవన్‌ (23) కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ వచ్చాడు. అయినప్పటికీ ఆరోగ్యం బాగుపడలేదు. రెండు రోజుల క్రితం బాగలూరు సమీపంలోని సిద్దనపల్లి గ్రామంలో బంధువుల ఇంటికెళ్లాడు. ఈ సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు, గమనించిన బంధువులు అతన్ని చికిత్స కోసం క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఫలితం లేక శనివారం రాత్రి మృతి చెందాడు. బాగలూరు పోలీసులు కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు