నిర్వహణ లోపం..బస్టాండ్‌కు శాపం

9 Nov, 2023 01:06 IST|Sakshi
కుడితినిలోని ఆర్టీసీ బస్టాండ్‌

కంప్లి: బళ్లారి నుంచి హొసపేటెకు, కంప్లికి వెళ్లే మార్గంలో కుడితిని పట్టణం ప్రధాన కేంద్రంగా ఉంది. కుడితిని మీదుగా కంప్లి, గంగావతి, హొసపేటె, సండూరు, కురుగోడులకు నిత్యం ఆర్టీసీ బస్సుల రాకపోకలు పెద్ద సంఖ్యలో సాగిస్తుంటాయి. భౌగోళికంగా, జనాభా పరంగా క్రమంగా విస్తరిస్తున్న ఇలాంటి చోట ప్రత్యేకంగా బస్టాండ్‌ సౌకర్యం కోసం అధికారులు చొరవ తీసుకుని కొన్నేళ్ల క్రితం ప్రధాన రహదారి పక్కనే ఉన్న స్థలంలో అన్ని హంగులతో కూడిన నూతన బస్టాండ్‌ నిర్మించారు. ఏ బస్సు అయినా కొత్త బస్టాండ్‌లోకి వచ్చి వెళుతుంటాయి. ఇలాంటి బస్టాండ్‌లో రానురాను నిర్వహణ లోపం శాపంగా మారింది. బస్టాండ్‌లో పరిశ్రుభత, పచ్చదనం, తాగునీరు, మరుగుదొడ్లు సౌకర్యం కరువై బస్టాండ్‌ పరిసరాలు అపరిశుభ్రతగా, జంగిల్‌గా మారిపోయింది. ఇక చీకటి పడితే అనైతిక కార్యకలాపాలకు అడ్డాగా, మందు బాబుల కేంద్రంగా మారింది. ఇకనైనా ఆర్టీసీ అధికారులు బస్టాండ్‌లో పరిశుభ్రతను, పచ్చదనాన్ని పెంపొందించి అనైతిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని కుడితిని వాసులు, ప్రయాణికులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు