రేపు బసవణ్ణ విగ్రహ ప్రతిష్టాపన

9 Nov, 2023 01:06 IST|Sakshi
కరపత్రాలను విడుదల చేస్తున్న ట్రస్ట్‌ పదాధికారులు

గంగావతి: నగరంలోని నెహ్రు పార్క్‌లో ఈ నెల 10న బసవణ్ణ విగ్రహాన్ని ప్రతిష్టాపిస్తున్నట్లు, అందుకోసం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని బసవేశ్వర ట్రస్ట్‌ అధ్యక్షులు మహాలింగప్ప బన్నికొప్ప పేర్కొన్నారు. ఆయన బుధవారం నగరంలో విలేకరులతో మాట్లాడారు. ఆరోజు ఉదయాన్నే 7 గంటలకు చెన్నబసవస్వామి మఠం వద్ద నుంచి పెద్ద ఎత్తున ఊరేగింపును నగర ప్రధాన వీధుల గుండా బస్టాండ్‌ వద్దనున్న నెహ్రు పార్క్‌ వరకు నిర్వహిస్తారన్నారు. సాయంత్రం 5 గంటలకు బసవణ్ణ విగ్రహాన్ని ప్రతిష్టింపజేస్తామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమాలకు గవిసిద్దేశ్వర మహాస్వామి, నాగభూషణ శివాచార్య, భువనేశ్వరయ్య తాత, గవిసిద్దయ్యతాత సాన్నిధ్యం వహిస్తారన్నారు. ధ్వజారోహణను ఎమ్మెల్యే గాలి జనార్ధన్‌రెడ్డి నెరవేరుస్తారన్నారు. బసవణ్ణ విగ్రహ ప్రతిష్టాపనను మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప నెరవేర్చనున్నారని తెలిపారు. ఆయనతో పాటు ప్రముఖులు హెచ్‌జీ రాములు, కొప్పళ జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి శివరాజ్‌ తంగడిగి, ఎంపీ కరడి సంగణ్ణ, మాజీ మంత్రులు ఇక్బాల్‌ అన్సారి, మల్లికార్జున నాగప్ప, సాలోణి నాగప్ప, మాజీ ఎమ్మెల్యేలు హెచ్‌ఎస్‌ మురళీధర్‌, బసవరాజ్‌ దఢేసూగూరు, మాజీ ఎంపీ శివరామగౌడ, మాజీ ఎమ్మెల్సీ హెచ్‌ఆర్‌ శ్రీనాథ్‌, తదితర ప్రముఖులు పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే పరణ్ణ మునవళ్లి అధ్యక్షత వహిస్తారన్నారు. ఈసందర్భంగా శంకర్‌గౌడ, శివకుమార్‌ మాలిపాటిల్‌, కౌన్సిలర్లు తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు