అనుమతి ఉన్న గైడ్లనే నియమించుకోవాలి

19 Nov, 2023 00:14 IST|Sakshi
మాట్లాడుతున్న జిల్లాధికారి దివాకర్‌

హొసపేటె: ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన హంపీని సందర్శించే పర్యాటకులు ప్రభుత్వ అనుమతి ఉన్న గైడ్‌లను నియమించుకోవాలని విజయనగర జిల్లా పర్యాటక అభివృద్ధి కమిటీ చైర్మన్‌ ఎంఎస్‌ దివాకర్‌ సూచించారు. శనివారం ఆయన మాట్లాడుతూ పర్యాటక శాఖ నుంచి శిక్షణ, గుర్తింపు కార్డులు పొందని వ్యక్తులు తమను తాము స్థానిక గైడ్‌ పరిచయం చేసకుంటున్నారన్నారు. హంపీలోని వివిధ స్మారక చిహ్నాల గురించి పర్యాటకులకు మార్గనిర్దేశం చేస్తున్నారన్నారు. ఇది నిబంధనలకు విరుద్ధమన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వ్యక్తులపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కొందరు ఆటోడ్రైవర్లు పర్యాటకులను ఆటోలో కూర్చోబెట్టి మార్గనిర్దేశం చేస్తున్నారనే ఫిర్యాదులు వినిపిస్తున్నాయన్నారు. ఈ విధంగా పర్యాటకులను గైడ్‌ చేయొద్దని సూచించారు. సంబంధిత ఆటో డ్రైవర్ల బ్యాడ్జ్‌, లైసెన్స్‌లను ప్రాంతీయ రవాణా అధికారులు పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. పర్యాటకులు హంపీలోని వివిధ స్మారక చిహ్నాలకు సందర్శించడానికి టూర్‌ గైడ్‌లను నియమించుకునేప్పుడు పర్యాటక శాఖ నుండి గుర్తింపు కార్డును పొందినట్లు నిర్ధారించుకోవాలన్నారు. పర్యాటక శాఖ ద్వారా శిక్షణ పొందిన టూరిస్ట్‌ గైడ్‌ల వివరాలు ఠీఠీఠీ.జుట్టఛీఛి.ఛిౌలో అందుబాటులో ఉంటాయని తెలిపారు.

పర్యాటకులకు సూచించిన కలెక్టర్‌

మరిన్ని వార్తలు