డిసెంబర్‌ 9న లోక్‌అదాలత్‌

19 Nov, 2023 00:14 IST|Sakshi
మాట్లాడుతున్న న్యాయధీశులు సదానంద నాగప్పనాయక్‌

గంగావతి: డిసెంబర్‌ 9వ తేదీన లోక్‌ అదాలత్‌ నిర్వహించనున్నామని అదనపు జిల్లా న్యాయధీశులు సదానంద నాగప్పనాయక్‌ తెలిపారు. కోర్టు ఆవరణలోని న్యాయవాదుల సంఘం సభాభవనంలో జడ్జి విలేకరులతో మాట్లాడారు. బ్యాంక్‌, ప్రైవేట్‌ వ్యక్తుల వద్ద దీర్ఘకాలికంగా ఉన్న రుణాలను ఇరుపక్షల వారు రాజీసంధానంతో పరిష్కరించుకోవచ్చునని చెప్పారు. కుటుంబ కలహాలు, విడాకుల కేసులు, భూ తగదాలు, ఇతర పలు రకాల కేసులను రాజీతో పరిష్కరించుకోవచ్చునని తెలిపారు. న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు మల్లికార్జున ముసాలి, ప్రధాన సివిల్‌ న్యాయధీశులు శ్రీదేవి దారబారె, అదనపు సివిల్‌ న్యాయధీశులు గౌరమ్మ పాటిల్‌ పాల్గొన్నారు.

కార్తీక దీపోత్సవాలు ప్రారంభం

కంప్లి: కూడ్లిగి తాలూకా కానమడుగు గ్రామంలోని శరణ బసవేశ్వరస్వామి దాసోహ మఠంలో శనివారం కార్తీక దీపోత్సవాలను మఠం ధర్మాధికారి ఐరుడి శరణార్య ఆధ్వర్యంలో ప్రారంభించారు. దేవస్థానం ముందు భాగంలో పూజా పురస్కారాలతో దీపపు స్తంభం ప్రతిష్టించి పూజలు జరిపారు. అనంతరం ధర్మాధికారి మాట్లాడుతూ.. కార్తీకమాసంలో దీపాలకు ఈ స్థంభం లేదని, ఈసారి అవకాశం కల్పించాలన్నారు.

మరిన్ని వార్తలు