-

కరువు పరిహారం ఏదీ?

28 Nov, 2023 01:26 IST|Sakshi
పరిహారం కోసం ఎదురు చూపుల్లో రైతులు

రాయచూరు రూరల్‌: రాష్ట్రంలో అతివృష్టి, అనావృష్టితో తమ పొలాల్లో వేసుకున్న పంటలు పండక జిల్లా రైతులు, పశుగ్రాసం లేక తల్లడిల్లుతూ, పంట నష్ట పరిహారం అందించాలని కోరుతూ వ్యవసాయ కూలీ కార్మికులు ఆందోళన చేపడుతున్నారు. కరువు సహాయం, పరిహారం అందించాలని అధికారులు, కార్యాలయాల చుట్టూ తిరిగినా అధికారులు తమకేమీ పట్టనట్లుగా ఉండటంపై రైతులు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. కళ్యాణ కర్ణాటకలో రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను ఆలకించేవారే లేకపోవడంపై వారు విచారం వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ కార్యదర్శులు, అధికారులు రైతులను చూసిన వెంటనే పారిపోతున్నారు. పంట నష్టపరిహారం కోసం గత నెల రోజుల నుంచి వేచి చూసినా ఫలితం లేకుండా పోయిందని రైతులు వాపోతున్నారు. రాష్ట్రంలో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా అధికారులు మౌనం వహించడాన్ని రైతులు తప్పుబడుతున్నారు. కేంద్ర ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ ట్విటర్‌లో సందేశాలు పంపుతున్నారు. రాష్ట్రంలో ఖరీఫ్‌, రబీల్లో వానలు లేక పోవడంతో తీవ్ర కరువు సంభవించినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయన్నారు. రాష్ట్రం నుంచి 25 మంది లోక్‌సభ సభ్యులు వెళ్లి కేంద్రానికి విన్నవించినా ఫలితం లేదన్నారు. రాష్ట్రంలో రూ.5 వేల కోట్ల మేర పంట నష్టం సంభవించినా కేంద్ర ప్రభుత్వ పెద్దలు కర్ణాటకపై శీతకన్ను వేసి కేవలం గుజరాత్‌ రైతులకు మాత్రం ఆపస్నహస్తం అందించడం ఎంతవరకు సమంజసమని రైతులు ప్రశ్నిస్తున్నారు.

రైతులకు తప్పని ఎదురుచూపులు

ట్విటర్‌లో కేంద్ర ప్రభుత్వానికి సందేశాలు

మరిన్ని వార్తలు