అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం.. ఒకరి మృతి

29 Nov, 2023 01:28 IST|Sakshi
మంటలను ఆర్పివేస్తున్న అగ్నిమాపక సిబ్బంది

యశవంతపుర: మంగళూరు నగరంలోని అత్తావరలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఆకస్మికంగా అగ్నిప్రమాదం జరిగింది. ఘటనలో వాష్‌రూమ్‌లో ఉన్న మూసబ్‌ (57) అనే మహిళ మృతి చెందారు. వివరాలు...అత్తావర అపార్ట్‌మెంట్‌లో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. స్నానం చేయటానికి వాష్‌రూమ్‌కు వెళ్లిన మూసబ్‌ ఊపిరాడక మృతి చెందగా మరొకరు తీవ్ర ఆస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయటంతో పెద్ద ప్రమాదం తప్పింది. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం జరిగినట్లు అధికారులు గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్లాట్‌లో 9 మంది ఉండగా ఏడుగురు ప్రమాదం నుంచి బయట పడ్డారు. పాండేశ్వర పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు.

మరిన్ని వార్తలు