ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్సులో మండ్య బాలుడు

29 Nov, 2023 01:28 IST|Sakshi
ఇండియా రికార్డ్సులో స్థానం సాధించిన దేవానందన్‌

మండ్య: వేగంగా ఇంగ్లిష్‌ పదాలను ఉచ్చరించడం ద్వారా మండ్యకు చెందిన ఐదేళ్ల బాలుడు దేవానందన్‌ ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్సులో తన పేరును నమోదు చేసుకున్నారు. 200 ఇంగ్లిష్‌ పదాలను కేవలం రెండు నిమిషాల 58 సెకండ్ల సమయంలో చదివి జాతీయ స్థాయిలో రికార్డును సృష్టించారు. మండ్య తాలూకా భూతన హోసూరు గ్రామానికి చెందిన సతీష్‌, దివ్య దంపతుల కుమారుడు దేవానందన్‌ గ్రామంలోని మండ్య క్లబ్‌ పాఠశాలలో యూకేజీ చదువుతున్నాడు. కన్నడ దిన పత్రికను కూడా వేగంగా చదవడంలో బాలుడు దిట్ట. పుస్తకంలో ఉన్న కన్నడ పదాలతో పాటు వాటిలో ఉన్న తప్పులను చూడా చూపించడం ఇతని ప్రత్యేకత. బాలుడి ప్రతిభను గుర్తించి అతని చిన్నాన్న సంతోష్‌గౌడ మరింత ప్రోత్సాహం అందించారు.

నిమోనియా కట్టడికి చర్యలు

మైసూరు: నిమోనియా జబ్బు వ్యాపించకుండా చర్యలు చేపట్టినట్లు డిహెచ్‌ఓ కుమారస్వామి తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మైసూరు నగరంతో పాటు జిల్లాలో శ్వాసకోశ రోగాలతో బాధపడేవారికి మంచి వైద్యసేవలు అందిస్తామన్నారు. ఇందుకోసం ఆక్సిజన్‌ ప్లాంట్‌లు, డ్రై రన్‌ నిర్వహించామని, తాలూకా ఆస్పత్రులలో 5 నుంచి 7 బెడ్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తామన్నారు. ఊపిరి ఆడకపోయినా, జ్వరం, ఇతర అసౌకర్యం ఉన్నా ఆస్పత్రికి వచ్చి చూపించుకోవాలన్నారు.

మరిన్ని వార్తలు