9న లోక్‌ అదాలత్‌

29 Nov, 2023 01:28 IST|Sakshi
కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న హోం మంత్రి

చిక్కబళ్లాపురం: ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసుల తక్షణ పరిష్కారం కోసం డిసెంబర్‌ 9న లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు జిల్లా జడ్జి నేరళె వీరభద్రయ్య భవాని తెలిపారు. మంగళవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... చెక్‌బౌన్స్‌ కేసులు, భూ సంబంధిత కేసులు, బ్యాంకు, కరెంట్‌ కేసులు తదితర వాటిని లోక్‌ అదాలత్‌ ద్వారా తక్షణ పరిష్కారం చేసుకోవచ్చని చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. విలేకరుల సమావేశంలో మరో జడ్జి అరుణ కుమారి పాల్గొన్నారు.

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

తుమకూరు: విద్యార్థులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని హోం మంత్రి పరమేశ్వర్‌ అన్నారు. మంగళవారం తుమకూరు నగరంలోని గెద్దలహళ్ళి సమీపంలోని బాలికల వసతి నిలయం ఆవరణంలో జరిగిన ఓ కార్యక్రమంలో హోం మంత్రి మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ లక్ష్య సాధనతో చదువుకోవాలని, తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలన్నారు. వసతి నిలయాల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు.

మరిన్ని వార్తలు