సామూహిక వరలక్ష్మీ పూజలు

29 Nov, 2023 01:28 IST|Sakshi
వరమహాలక్ష్మి పూజ

గౌరిబిదనూరు: స్వయం సేవా సంస్థలు తమ కర్తవ్యాలకు తోడుగా ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యే పుట్టస్వామిగౌడ తెలిపారు. మంగళవారం తాలూకా డి పాళ్య గ్రామం ఎన్‌ఆర్‌ కల్యాణ మంటపంలో ధర్మస్థల గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరిగిన సామూహిక వరమహాలక్ష్మి పూజ, మహిళా సంఘాల ఐక్య వేదిక అధికార బాధ్యతల స్వీకారోత్సవంలో పాల్గొని మాట్లాడారు. ప్రాజెక్ట్‌ అధికారి నాగరాజనాయ్క సంస్థ నుండి లభించే సౌలభ్యాలను వివరించారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు రాఘవేంద్ర హనుమాన్‌, లలితా సుధాకర్‌, విశ్రాంత ఉపాధ్యాయుడు రామకృష్ణప్ప, ఆర్య వైశ్య మండలి అధ్యక్షుడు హరీశ్‌, శకుంతల, లక్ష్మి, బెట్టగౌడ, నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు