భజరంగ్‌ దళ్‌ కార్యకర్తల అరెస్ట్‌

29 Nov, 2023 01:28 IST|Sakshi
అరెస్టయిన భజరంగదళ్‌ కార్యకర్తలు

యశవంతపుర: అన్యమతానికి చెందిన యువతి, యువకుడు తిరుగుతుండగా ఇద్దరు భజరంగదళ కార్యకర్తలు వారిపై దౌర్జన్యానికి పాల్పడిన ఘటన మంగళూరులో జరిగింది. మంకి స్పెండ్‌కు చెందిన యువకుడు చిక్కమగళూరుకు చెందిన యువతితో ఒక మాల్‌కు వెళ్లారు. స్కూటర్‌పై జోడీ తిరుగుతున్న విషయాన్ని భజరంగదళ్‌ కార్యకర్తలు గుర్తించి వీరిని బైకుపై వెంబడించారు. మంకిస్పెండ్‌ వద్ద బైకును అడ్డగించి దౌర్జన్యం చేశారు. విషయం తెలుసుకున్న రెండు మతాలకు చెందిన జనం గుమికూడటంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు రెండు గ్రూపులపై లాఠీచార్జ్‌ చేసి చెదరగొట్టారు. భజరంగదళ్‌కు కార్యకర్తలు అక్షయ్‌ రావ్‌, శిబిన్‌ పడికల్‌లను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

మరిన్ని వార్తలు