వేడుకగా లక్ష్మీవేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం

29 Nov, 2023 01:38 IST|Sakshi
లక్ష్మీవేంకటేశ్వర స్వామికి పూజలు చేస్తున్న అర్చకులు

హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి పట్టణంలోని వేంకటేశ్వర ఆలయంలో మంగళవారం లక్ష్మీ వేంకటేశ్వర కల్యాణోత్సవం, రథోత్సవాలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారు జాము నుంచే కల్యాణోత్సవం ప్రారంభమై సాయంత్రం వరకు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. సాయంత్రం రథోత్సవం జరిగింది. పట్టణంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన వేలాది మంది భక్తులు కల్యాణోత్సవాన్ని తిలకించారు.వేంకటేశ్వర ఆలయ సేవా కమిటీ, సవితా సమాజ, ఆర్యవైశ్య సమాజంతో పాటు అన్ని కులాల భక్తులు, పౌరులు, వివిధ సంఘాల నాయకులు, మహిళలు, పిల్లలు, పెద్దలు అందరూ లక్ష్మీవేంకటేశ్వర కల్యాణోత్సవానికి హాజరయ్యారు. రథోత్సవానికి హాజరైనవారు గోవిందగిరి భజన చేశారు. కళాకారులు, వాయిద్యకారులు విభిన్న కళా బృందాలు, వేలాది మంది భక్తులు కల్యాణోత్సవం, రథోత్సవంలో పాల్గొని స్వామి వారి కృపకు పాతులయ్యారు.

మరిన్ని వార్తలు